కొండగట్టు,వెలుగు: కొండగట్టు ఆలయంలో గోదాదేవి–రంగనాథుల కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అధికారులు కల్యాణం నిర్వహించారు. ప్రధానాలయం నుంచి ఉత్సవమూర్తులను భక్తులు , అధికారులు, అర్చకులు పల్లకిలో తీసుకొచ్చారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వెంకటేశ్, ఏఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్శ్రీనివాస శర్మ, లీడర్లు శ్రీనివాస్ గౌడ్, శంకర్, ఆనందరెడ్డి, నారాయణ, స్వామి పాల్గొన్నారు.
రాయికల్/జమ్మికుంట/కోరుట్ల, వెలుగు: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో, జమ్మికుంట రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయంలో, గీతా మందిరాల్లో గోదా దేవి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కోరుట్లలోని పురాతన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్సీనియర్లీడర్జువ్వాడి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సతీమణి సరోజ , ఈవో విక్రం తదితరులు పాల్గొన్నారు. ఆయా ఆలయాల్లో ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, అర్చనలు జరిపారు. భక్తుల కోలాటం, చిన్నారుల నృత్యాలు, భజనలు ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదానం చేపట్టారు.