కమనీయం.. గోదారంగనాథ కల్యాణం

నల్గొండ, సూర్యాపేట, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల్లో ఆదివారం గోదారంగనాథ కల్యాణం కమనీయంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని సీతారామచంద్ర ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ఆర్‌‌‌‌అండ్‌‌బీ, సినీమాటో గ్రఫీ  మంత్రి   కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి, సబిత దంపతులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితుల  మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ క్రతువును వైభవంగా జరిపారు.

దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  నిర్వహించిన గోదాదేవి కళ్యాణంలో ఎమ్మెల్యే బాలూనాయక్, సూర్యాపేటలోని వెంకటేశ్వర స్వామి, వేణుగోపాలస్వామి , రాధాకృష్ణ దేవాలయాల్లో ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌‌ రెడ్డి, మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడగ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు.