న్యూఢిల్లీ : ఇథనాల్‌ను తయారు చేసే గోదావరి బయోరిఫైనరీస్ ఇనీషియ్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) లో ఒక్కో షేరును రూ.334–352 రేంజ్‌లో అమ్మనుంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 23 న ఓపెనై 25 న ముగుస్తుంది. అక్టోబర్ 22 న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఓపెన్‌లో ఉంటుంది. ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ. 325 కోట్లను సేకరించాలని చూస్తున్న కంపెనీ, మరో రూ.230 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో సేకరించనుంది.
ఓఎఫ్‌ఎస్ కింద 65.27 లక్షల షేర్లను కంపెనీ షేర్‌హోల్డర్ మండాల క్యాపిటల్ ఏజీ, ఇతర షేర్‌హోల్డర్లు అమ్మనున్నారు. ఫ్రెష్ షేర్ల ఇష్యూ నుంచి సేకరించే ఫండ్స్‌లో రూ.240 కోట్లను అప్పులు తీర్చడానికి, కార్పొరేట్ అవసరాలకు వాడతామని గోదావరి బయోరిఫైనరీస్ ప్రకటించింది.