జియో ట్యూబ్స్‌‌‌‌ టెక్నాలజీతో గోదావరి కరకట్ట

జియో ట్యూబ్స్‌‌‌‌ టెక్నాలజీతో గోదావరి కరకట్ట
  •     నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి సీతక్క

ఏటూరునాగారం, వెలుగు : జియో ట్యూబ్స్‌‌‌‌ టెక్నాలజీతో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం నుంచి మంగపేట మండలం వరకు గోదావరి కరకట్ట నిర్మించనున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. కలెక్టర్ దివాకర్‌‌‌‌, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రాతో కలిసి శుక్రవారం ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో గోదావరి కరకట్ట నిర్మాణ ప్రాతాలను పరిశీలించారు. అనంతరం నీటిపారుదల శాఖ ఆఫీసర్లతో ఐటీడీఏలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కరకట్ట నిర్మాణంపై పవర్‌‌‌‌ పాయింట్‌‌‌‌ ప్రజంటేషన్‌‌‌‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌‌‌‌ కారణంగా కరకట్ట నిర్మాణంలో ఆలస్యం జరిగిందన్నారు.

భారీ వరద వచ్చినా కరకట్టకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అత్యాధునిక టెక్నాలజీతో డిజైన్లు రూపొందిస్తున్నట్లు చెప్పారు. నూతన టెక్నాలజీతో శాశ్వత ప్రాతిపదికన కరకట్ట నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే తుప్పు పట్టిన షట్టర్లకు రిపేర్లు చేయించాలని ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ పి.శ్రీజ ఏటూరునాగారం ఏఎస్పీ మహేశ్‌‌‌‌ బాబా గీతే, ఇరిగేషన్‌‌‌‌ చీఫ్ ఇంజినీర్‌‌‌‌ విజయ్‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం ఏటూరునాగారం మండలకేంద్రంలోని ఆకులవారిఘనపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు.

స్టూడెంట్లతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల స్టూడెంట్లకు పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా హాస్టల్‌‌‌‌ పరిసరాలు క్లీన్‌‌‌‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టూడెంట్లు చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాలని చెప్పారు. 

మేడారం వనదేవతలను దర్శించుకున్న సీతక్క

తాడ్వాయి/మంగపేట, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, సారలమ్మను శుక్రవారం మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్‌‌‌‌, ఐటీడీఏ ప్రాజెక్ట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ చిత్రా మిశ్రా, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ శ్రీజ దర్శించుకున్నారు. వారికి ఎండోమెంట్‌‌‌‌ ఆఫీసర్లు, పూజారులు ఘన స్వాగతం పలికారు. వారి వెంట ఈవో రాజేంద్ర, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, తహసీల్దార్‌‌‌‌ తోట రవీందర్, కాంగ్రెస్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి పాల్గొన్నారు. అంతకుముందు ములుగు జిల్లా మంగపేటలో రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్‌‌‌‌ను ప్రారంభించారు.