భూకంపాల జోన్‍లో గోదావరి

భూకంపాల జోన్‍లో గోదావరి

ప్రకంపనలతో కలకలం

భద్రాచలం, వెలుగు: భూకంపాల జోన్‍లో గోదావరి పరివాహకాన్ని ఎన్‍జీఆర్‍ఐ గతంలోనే ప్రకటించింది. నేషనల్‍ జియోగ్రాఫికల్‍ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఆజీ ర్‍ఐ) ప్రకటించినట్లుగానే వరుస ప్రకంపనలు తీరప్రాంత ప్రజలను, జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్నా యి. 1869 నుంచి 2020 వరకు ఏకంగా 25 సార్లు గోదావరి తీరంలో భూకంపాలు రావడం గమనార్హం. ఇందుకు భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణమని ఎన్‍జీఆర్‍ఐ వెల్లడించింది. గోదావరి అడుగు భాగాన హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి గోదావరి ప్రాంతంలో ‘గ్రాబెన్‍ ‘ నిర్మాణం ఉంది. దీనివల్ల భూమిపై పొరలు మాత్రమే కంపిస్తాయి. గోదావరి రీజియన్‍ను భూకంప ప్రాంతాల్లో 3వ రీజియన్‍లో చేర్చారు. ఈ ప్రాంతంలో వచ్చే భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం ఉండదు. 1869 నుంచి వచ్చిన భూకంపాలను పరిశీలిస్తే 2 నుంచి 5 లోపే రిక్టర్‍ స్కేల్‍పై నమోదు అవుతోంది. ఆదివారం ఉదయం పాల్వంచ కేంద్రంగా వచ్చిన భూ ప్రకంపనలు రిక్టర్‍స్కేల్‍పై2.20 మాగ్నిటూడ్స్ గా నమోదైంది.

151 ఏళ్ల లో 25 సార్లు..
1869 నుంచి 2020 వరకు 151 ఏళలో ఇప్పటివరకు గోదావరి పరివాహక ప్రాంతంలో 25 సార్లు భూమి కంపించింది. 1869లో కాకినాడ కేంద్రంగా
4.3 మాగ్నిటూడ్స్ నమోదైంది. 1872లో బెల్లంపల్లి (సిరొంచ) కేంద్రంగా 4.5, 1898లో కాకినాడ కేంద్రంగా 4.1, 1954లో కొత్తగూడెం కేంద్రంగా
4.1, 1963లో ఖమ్మం కేంద్రంగా 5.0, 1968లో భద్రాచలం-కొత్తగూడెం మధ్యన 4.5,1968లో భద్రాచలం-చర్ల మధ్య 5.3, 1969లో భద్రాచలం కేంద్రంగా 4.6, 1972లో మహబూబ్‍బాద్‍ కేంద్రంగా 2.9, 1975లో కాజీపేట-మేడికొండ మధ్య 3.3, 1975లో కరీంనగర్‍కేంద్రంగా 3.2, 1976లో వైరూర్‍ కేంద్రంగా 2.7, 1976లోనే వైరూర్‍ కేంద్రంగా రెండోసారి 2.8, 1978లో ఇల్లెందులపాడు కేంద్రంగా 3.8, 1980లో ఇస్మాబాద్‍ కేంద్రంగా 2.9, రెండోసారి రంపచోడవరం కేంద్రంగా 4.3, మూడోసారి రంపచోడవరం కేంద్రంగా 3.8, 1983లో బెల్లంపల్లి కేంద్రంగా 3.8, 1984లో బెల్లంపల్లి కేంద్రంగా 3.5, 1991లో బెల్లంపల్లి కేంద్రంగా 3.6, 2004లో కొత్తగూడెం-భద్రాచలం మధ్య 3.0, 2009లో పాల్వంచ-ఇల్లెందు మధ్య 2.7, 2018లో పాల్వంచకు భూమి లోపల 15 కిలోమీటర్ల కేంద్రంగా 4.0, రెండోసారి 2.0, తాజాగా 2020లో పాల్వంచ కేంద్రంగానే 2.20 మాగ్నిటూడ్స్ నమోదైంది.

బూర్గంపహాడ్ లో స్వల్పంగా..
బూర్గంపహాడ్, మండలంలో ఆదివారం స్వల్పంగా భూమి కంపించింది. అంజనాపురం, మోరంపల్లి బంజర్ గ్రామాల్లో మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో రెండు సెకన్లు పాటు భూమి కంపించడంతో స్థానికులు ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

పాల్వంచలో కంపించిన భూమి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఆదివారం స్వల్ప భూకంపం వచ్చింది. మధ్యాహ్నం 12:32 గంటలకు మూడు సెకన్ల పాటు భూమి
కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు. రిక్టర్ స్కేల్ పై
2.20 మాగ్నిటూడ్స్గా నమోదైనట్లు ఆఫీసర్లు తెలిపారు.

For More News..

రాష్ట్రంలో 334కు చేరిన కరోనా కేసులు