
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో ఇవాళ రాత్రికి భద్రాచలం వద్ద వరద తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 63 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సుమారు 5వేల మందిని పునారావాస కేంద్రాలకు తరలించారు. ఇక సీఎం ఆదేశాలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.