
గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీలో రూపొందిస్తున్న గోదావరి కరకట్ట మోడల్‌ను మంత్రి సీతక్క గురువారం పరిశీలించారు. గోదావరికి వరద పోటెత్తిన సమయంలో ఇండ్లను ముంచెత్తకుండా ములుగులో కరకట్ట నిర్మిస్తున్నట్లు తెలిపారు.
క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఇంజినీర్లు మోడల్‌ను రూపొందిస్తున్నారన్నారు. వరద తీవ్రత ఎంత ఉన్నా నష్టం ప్రజలకు నష్టం జరగకుండా నిర్మాణం ఉండాలన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి ములుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కరకట్టతో వాటికి చెక్ పెట్టాలన్నారు. మోడల్‌పై మరిన్ని పరిశోధనలు చేసి డిజైన్ ఫైనల్ చేస్తామన్నారు.