పాట్నా హైకోర్టుకెళ్లిన గోదావరి సినిమా హీరోయిన్... ఏం జరిగిందంటే..?

పాట్నా హైకోర్టుకెళ్లిన గోదావరి సినిమా హీరోయిన్... ఏం జరిగిందంటే..?

తెలుగులో గోదావరి, సత్యమేవ జయతే తదితర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన బెంగాలీ నటి నీతూ చంద్ర తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమే. అయితే ఇటీవలే నటి నీతూ చంద్ర పాట్నా కోర్టుని ఆశ్రయించిన వ్యవహారం బాలీవుడ్, భోజ్‌పురిసినీ పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అసభ్యకరమైన భోజ్‌పురి మరియు హిందీ పాటలను బ్యాన్ చెయ్యాలని కోరుతూ నీతూ చంద్ర బీహార్ లోని పాట్నా హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఇందులో భాగంగా ఈ పాటలకి కొందరు స్కూల్ కి వెళ్లే విద్యార్థినులు కూడా అట్రాక్ట్ అవుతున్నారని దీంతో ఇలాంటి పాటలకి రీల్స్ చెయ్యడం, పాడడం వంటివి చేస్తున్నారని ఇది అంత మంచిది కాదని పిల్ లో పేర్కొంది. అంతేకాదు ఇలాంటి పాటలు పాడే సింగర్స్ తోపాటూ చిత్రీకరించే వారిని కూడా శిక్షించాలని కోర్టుని కోరింది. అసభ్యకరమైన సాంగ్స్ కారణంగా ఇంట్లో టీవీ చూడాలంటే ఇబ్బందిగా ఉంటోందని, అలాగే ఇలాంటి పాటలు కారణంగా మహిళలు తప్పుదోవపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ALSO READ | KayaduLohar: స్టార్ హీరోతో కయాదు లోహర్ రొమాన్స్.. డ్రాగన్ బ్యూటీ నెక్స్ట్ సినిమా ఇదే

ఈ విషయం ఇలా ఉండగా ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా భోజ్‌పురి మరియు హిందీ పాటల రీల్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పాటల్లో కొంతమేర అసభ్యకరమై లిరిక్స్ తో పాటూ ఓవర్ ఎక్స్ పోజింగ్ వంటివి కూడా ఉంటున్నాయి. ఈ కారణంగానే ఇలాంటి పాటలని బ్యాన్ చెయ్యాలని నటి నీతూ చంద్ర కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే సాంగ్స్ కి సెన్సార్ లేకపోవడంతో  డబుల్ మినింగ్ లిరిక్స్, ఓవర్ ఎక్స్ పోజింగ్ వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఈ సాంగ్స్ కంటెంట్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.