భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువనుంచి వస్తున్న భారీ వరదతో భద్రాచలం వద్ద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నీటి ప్రవాహం 53 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు..
ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని నుంచి భారీగా వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నది. ఇప్పటికే భద్రాచలం నుంచి ఎగువ ప్రాంతాలకు దుమ్ముగూడెం మండలంలో పలుచోట్ల చర్ల, వాజేడు ,వెంకటాపురం, అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్ర ప్రాంత విన కూనవరం చింతూరు ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోయాయి. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు