
- ముందస్తు సమాచారం లేకుండానే ప్రకటన
హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్మేనేజ్మెంట్బోర్డ్(జీఆర్ఎంబీ) మీటింగ్ నిర్వహణ విషయంలో బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. రెండు రాష్ట్రాలకు ముందస్తు సమాచారం లేకుండానే, రాష్ట్రాల సమ్మతి తీసుకోకుండా ఈ నెల 7న బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి అదే రోజు గోదావరి, కావేరి లింక్‌కు సంబంధించిన కీలక సమావేశాన్ని నేషనల్ వాటర్ డెవలప్మెంట్అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) నిర్వహించనుంది.
ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈ నెల 7నే సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు బుధవారం జీఆర్ఎంబీ సమాచారం పంపింది. దీనిపై రెండు రాష్ట్రాల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోజు జీసీ లింక్ మీటింగ్ ఉందని, రాష్ట్రాల అధికారుల అభిప్రాయాలు తీసుకోకుండా మీటింగ్ ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. దీంతో మీటింగ్‌ను వాయిదా వేసే అవకాశాలూ కనిపిస్తున్నాయి.