గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. 48 అడుగులకు వరద చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గంటగంటకు గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది. మధ్యాహ్నం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా... ఇప్పుడు 48 అడుగులకు చేరుకుంది.
గోదావరి ఉపనదులు ఇంద్రావతి, శబరి ఉధృతి పెరగడంతో.. గోదావరిలో అనూహ్యంగా వరద పెరుగుతోంది. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్ ఇచ్చారు. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక భద్రాద్రి ఆలయం అన్నదాన సత్రం వరకు గోదావరి వరద చేరుకుంది. వరద ఇలానే కంటిన్యూ అయితే రేపు మూడో ప్రమాద హెచ్చరిక కూడా ఇచ్చే అవకాశం కనబడుతోంది.