గోదావరిలో ఇద్దరు చిన్నారులు గల్లంతు

గోదావరిలో ఇద్దరు చిన్నారులు గల్లంతు

భద్రాద్రి కొత్తగూడెం: ఈత కోసం వెళ్లిన చిన్నారులు గోదావరిలో మునిగిపోయారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ఏటపాక గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో శుక్రవారం మధ్నాహ్నం ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో భద్రాచలానికి చెందిన మహేశ్ మృతదేహం లభ్యం కాగా.. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.