బీ అలర్ట్: 50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ..

బీ అలర్ట్: 50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ..

తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు నదులకు వరద తాకిడి పెరిగింది. ఈ క్రమంలో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో  ఉపనదులు పొంగిపొర్లడంతో  గోదావరికి వరద తాకిడి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో 50 అడుగుల నీటిమట్టం నమోదయింది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.

ఇంద్రావతి ప్రాణహిత ఉపనదుల నుండి  భారీగా వరద నీరు గోదారిలో కలుస్తోందని సమాచారం. ఎగువనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న  నేపథ్యంలో దిగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు అధికారులు. ప్రాజెక్టుకు చెందిన ఇరవై ఒక్క గేట్లను ఎత్తి  నీటిని గోదావరిలోకీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.

Also Read:-నైట్ క్లబ్లో కాల్పులు.. ముగ్గురు టీనేజర్స్ స్పాట్ డెడ్..

సుమారు 11.50 లక్షల క్యూసెక్కుల వరద నమోదు అవుతుందిని, ఈరోజు రాత్రి 9 గంటలకు 51.20  అడుగులకు చేరుకుంటుందని సిడబ్ల్యుసి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం  భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తున్నట్టు కనిపించినప్పటికీ మంగళవారం రాత్రికి 53 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర జల వనరుల సంఘం తెలిపింది.