సీతారామ ప్రాజెక్టుపంపుహౌస్ నుంచి కాల్వలకు నీరు

సీతారామ ప్రాజెక్టుపంపుహౌస్ నుంచి కాల్వలకు నీరు
  • వేసవి దృష్ట్యా విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు

భద్రాచలం,వెలుగు : భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంపుహౌస్​ నుంచి గోదావరి నీటిని గురువారం కాల్వలకు ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఎగువన తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ నుంచి 1200 క్యూసెక్కుల నీరు చేరుకుంది. దుమ్ముగూడెం ఆనకట్ట మీదుగా దిగువకు వృథాగా జలాలు పోతుండగా.. రోజుకు రెండు గంటల పాటు పంపుహౌస్​ను స్టార్ట్ చేసి 40 కిలోమీటర్ల మేర కాల్వల్లో నింపుతున్నారు.

వేసవి దృష్ట్యా జిల్లాలోని నాగార్జున సాగర్​ప్రాజెక్టు కెనాల్​కు నీటిని చేర్చనున్నారు. జిల్లాలో వేసవి అవసరాలు తీర్చేలా కాల్వ మొత్తం గోదావరి జలాలను సరఫరా చేయనున్నారు. బీజీ కొత్తూరు వద్ద ఉన్న తొలి పంపుహౌస్ వద్ద ఇంజనీర్ శ్రీనివాస్​ఆధ్వర్యంలో పంపింగ్​ను పరిశీలిస్తున్నారు.