
గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ శనివారం కొనసాగింది. ఉదయం మొదటి మ్యాచ్ లో పాలకుర్తి, యైటింక్లయిన్‌కాలనీ టీమ్స్ పోటీ పడగా యైటింక్లయిన్‌కాలనీ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాలకుర్తి టీమ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 119 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యైటింక్లయిన్‌కాలనీ జట్టు 8.4 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది.
యైటింక్లయిన్‌కాలనీ జట్టులో కలీ పవార్ఇస్లావత్ 24 బాల్స్‌లోనే 56 రన్స్చేయగా, రిషీ మాధవ్10 బాల్స్‌లో 25, ప్రవీణ్‌రెడ్డి 13 బాల్స్‌లో 28 రన్స్చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా పవార్ ఇస్లావత్ ఎంపికయ్యారు. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్ లో అంతర్గాం, గోదావరిఖని జట్లు పోటీ పడ్డాయి. అంతర్గాం జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 131 రన్స్చేసింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన గోదావరిఖని జట్టు 14.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 133 రన్స్ చేసి విజయం సాధించింది. క్రాంతి 47 బాల్స్‌లో 60, కన్నా 24 బాల్స్‌లో 48 రన్స్చేశారు. ఐదు వికెట్లు తీసిన గోదావరిఖని టీమ్ బౌలర్మనోహర్మణిపాలను ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.