కాకా క్రికెట్ టోర్నీలో..యైటింక్లయిన్​కాలనీ, ఎన్టీపీసీ గెలుపు

గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ ఆదివారం కొనసాగింది. ఉదయం మొదటి మ్యాచ్ అంతర్గాం, యైటింక్లయిన్​కాలనీ జట్ల మధ్య జరగ్గా యైటింక్లయిన్​ కాలనీ విజయం సాధించింది. 20 ఓవర్లలో యైటింక్లయిన్​కాలనీ జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 164 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన అంతర్గాం జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 111 పరుగులు మాత్రమే చేసింది.

యైటింక్లయిన్​ కాలనీ జట్టులో 33  బాల్స్​లో 56 రన్స్ ​చేసిన మధు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు. మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్​లో ఎన్టీపీసీ, గోదావరిఖని తలపడ్డాయి. గోదావరిఖని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 156 రన్స్​చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఎన్టీపీసీ 12.5  ఓవర్లలో నాలుగు  వికెట్లు నష్టపోయి 159  రన్స్ ​చేసి గెలిచింది. 40 బాల్స్​లో 73 రన్స్​ చేసి నాట్​అవుట్​గా నిలిచిన ఎన్టీపీసీ ప్లేయర్ జావీద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇదే జట్టులో సాయికృష్ణ 19 బాల్స్​లో 47 రన్స్​ చేసి ప్రతిభ చూపాడు. 

పెద్దపల్లి నియోజకవర్గ విన్నర్​ సుల్తానాబాద్​

పెద్దపల్లి :  కాకా స్మారక పెద్దపల్లి నియోజకవర్గ  స్థాయి క్రికెట్ టోర్నీలో సుల్తానాబాద్ విన్నర్​గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పెద్దపల్లి, సుల్తానాబాద్ పోటీ పడ్డాయి. మొదట బ్యాటింగ్​ చేసిన సుల్తానాబాద్​15 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 154  రన్స్​ చేసింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన పెద్దపల్లి 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 89 రన్స్ ​చేసింది. దీంతో సుల్తానాబాద్ విన్నర్ గా నిలిచింది. మ్యాన్ ​ఆఫ్ ​ద సిరీస్, మ్యాన్​ఆఫ్​ ద మ్యాచ్​గా సుల్తానాబాద్​కు చెందిన క్రాంతి నిలిచాడు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పలువురు అభినందించారు.