సేఫ్టీలో సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు సెకండ్‌‌‌‌‌‌‌‌ ప్రైజ్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : సింగరేణి 53వ వార్షిక రక్షణ వారోత్సవాలు గత ఏడాది జరుగగా.. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌, కార్మికులకు అందిస్తున్న సేవలు, రక్షణ విషయంలో గోదావరిఖని ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు ఓవరాల్‌‌‌‌‌‌‌‌ సెకండ్‌‌‌‌‌‌‌‌ ఫ్రైజ్‌‌‌‌‌‌‌‌ లభించింది. బుధవారం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో క్వాలిటీ జీఎం కె.వెంకటేశ్వరరావు, రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌ సేప్టీ జీఎం సాంబయ్య చేతుల మీదుగా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ డీసీఎంఓ డాక్టర్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ షీల్డ్‌‌‌‌‌‌‌‌ను అందుకున్నారు.

కాగా 54వ రక్షణ వారోత్సవాల సందర్భంగా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో తనిఖీ బృందం బుధవారం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో చీఫ్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ బి.అంబిక, డిప్యూటీ ఛీప్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ పి.రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు, ఐటీ డీజీఎం హరి శంకర్‌‌‌‌‌‌‌‌రావు, మెడికల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ పి.శేషగిరిరావు పాల్గొన్నారు.