గోదావరిఖని... ప్రెస్ క్లబ్‌‌‌‌ ఎన్నికలు

గోదావరి ఖని, వెలుగు: గోదావరిఖని ప్రెస్ క్లబ్‌‌‌‌కు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 129 మంది సభ్యుల్లో 123 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాత్రి వరకు ఓట్ల లెక్కింపు నిర్వహించారు.

అధ్యక్షులుగా పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా పందిళ్ల శ్యాంసుందర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మాదాసు శ్రీనివాస్, గసిగంటి రవీందర్, సంయుక్త కార్యదర్శులుగా ఇజయగిరి సమ్మయ్య, వీరాగౌడ్, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌గా గడ్డం శ్యాంకుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కూసం శ్రీనివాస్ తోపాటు మిగతా 11 మందిని కార్యవర్గ సభ్యులగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా నారాయణ, సహాయ అధికారులుగా విజయ్ కుమార్, చంద్రశేఖర్ వ్యవహరించారు.