గోదావరిఖనిలో గుజరాత్ ఆంటీ టెర్రర్ స్క్వాడ్ టీమ్స్ దాడులు

ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శ్రీనగర్ కాలనీలో గుజరాత్ ఆంటీ టెర్రర్ స్క్వాడ్ టీమ్స్ దాడులు నిర్వహించాయి. జావిద్, అతని కూతురును ఏటిఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జావిద్కు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి. గతంలో హైదరాబాద్ లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో జావిద్ కు సంబంధం ఉంది.  ఇటీవల ఉగ్రవాదులతో వాట్సప్ లో చాటింగ్ చేశారనే సమాచారంతో గుజరాత్ ఎటిఎస్ అధికారులు జావిద్ ఇంటి పై దాడి చేసి సోదాలు నిర్వహించారు.  జావిద్ తో పాటు అతని కూతురిని అదుపులోకి తీసుకున్నారు.