గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ మొట్టమొదటి ఫ్యామిలీ ఈ స్కూటర్ ను లాంచ్ చేసింది. Eblu Feo X పేరుతో ఈ- -స్కూటర్ సరికొత్త మోడల్ గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ తయారు చేసి అమ్మకాలు ప్రారంభించింది. ఈ కంపెనీ Eblu లైన్ ఎలక్ట్రిక్ టూ, త్రి-వీలర్‌లను తయారు చేస్తుంది. Eblu Feo X, 2.36 KW Li-ion బ్యాటరీతో ఒకసారి ఛార్జింగ్ చేస్తే 110 km ప్రయాణిస్తుంది. ఇది భారతదేశంలోని EV టూవీలర్ మార్కెట్ లో కంపెనీ రెండవ ఆఫర్. దీని ధర రూ. 99వేల 999లు.
Eblu Feo X 2.36 kW Li-ion బ్యాటరీ, మూడు డ్రైవింగ్ మోడ్‌లు, ఒకసారి ఛార్జింగ్ చేస్తే110 కిమీ పరుగులు పెడుతుంది. గంటకు 60 కి.మీల గరిష్ట వేగంతో నడపొచ్చు. బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించడానికి రీ ప్రొడ్యూస్ బ్రేకింగ్‌ను కలిగి ఉంది. వాహనం 1850 mm, 1140 mm ఎత్తు, 1345 mm వీల్‌బేస్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ కొలతలు కలిగి ఉంది.
AHO LED హెడ్‌లైట్లు, అధిక రిజల్యూషన్‌తో LED టెయిల్ ల్యాంప్‌లు, సెన్సార్ ఇండికేటర్‌తో సైడ్ స్టాండ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ ట్యూబ్ డ్యూయల్ షాక్‌లు, CBS డిస్క్ బ్రేక్ , 12-అంగుళాల రీప్లేస్ చేయగలిగే ట్యూబ్‌లెస్ టైర్లు వంటి అద్బుతమైన ఫీచర్లు Eblu Feo ఈ- స్కూటర్ లో ఉన్నాయి.
విస్తారమైన ఫ్లోర్‌బోర్డ్, ఎర్గోనామిక్ సీటింగ్, నావిగేషన్ కోసం బ్లూటూత్ టెక్నాలజీ, 28 లీటర్ల కింద సీటు స్టోరేజ్, ఇన్‌కమింగ్ మెసేజ్ అలర్ట్‌లు, కాల్ అలర్ట్‌లు, రివర్స్ ఇండికేటర్‌లు, బ్యాటరీ SOC ఇండికేటర్‌లు, థొరెటల్ ఫాల్ట్ సెన్సార్లు, మోటార్ ఫాల్ట్ సెన్సాలు, బ్యాటరీ అలర్ట్‌లు, హెల్మెట్ కోసం నావిగేషన్ అసిస్టెంట్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 7.4-అంగుళాల డిజిటల్ ఫుల్-కలర్ డిస్‌ప్లే ఉంది.
గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి దేశవ్యాప్తంగా 74 డీలర్‌షిప్‌లను కలిగి ఉంది.వీటిని 100కి పెరగాలని యోచిస్తోంది. ప్రస్తుతం సంస్థ Eblu స్పిన్, Eblu థ్రిల్, Eblu Feo (EV బైక్), Eblu Rozee (EV మూడు- వీలర్-L5M) దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ దుకాణాలలో అమ్మకాలు సాగిస్తోంది.