న్యూఢిల్లీ: సిగరెట్ల తయారీ కంపెనీ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ బోనస్ షేర్లను ఇష్యూ చేయనుంది. ఒక షేరు కలిగి ఉన్న షేర్‌హోల్డర్‌కు రెండు షేర్లని బోనస్‌గా ఇవ్వనుంది. 2:1 రేషియోలో అంటే రూ.2 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేరుకి కొత్తగా రెండు ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేర్లను బోనస్‌గా ఇస్తామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ నెల 20 న జరిగే బోర్డ్ మీటింగ్‌లో షేర్ హోల్డర్ల అనుమతి తీసుకుంటామని ప్రకటించింది. బోనస్ షేర్ల ప్రకటనతో కంపెనీ షేర్లు శుక్రవారం దూసుకుపోయాయి. 11 శాతం ర్యాలీ చేసి రూ.7,115 దగ్గర సెటిలయ్యాయి. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు గత నెల రోజుల్లో 75 శాతం పెరగగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 240 శాతం రిటర్న్ ఇచ్చాయి.