రైతుల కోసం ‘హలో గోద్రెజ్’ ప్రారంభం

రైతుల కోసం ‘హలో గోద్రెజ్’ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు : వ్యవసాయ -వ్యాపార సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (జీఏవీఎల్) పంట రక్షణకు ఎప్పటికప్పుడు ఫోన్ కాల్ ద్వారా నిపుణుల సలహాలను అందించడానికి 'హలో గోద్రేజ్' పేరుతో హెల్ప్​లైన్​ను ప్రారంభించినట్లు ప్రకటించింది.   హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, బెంగాలీ, పంజాబీ,  ఇంగ్లీష్​ భాషల్లో - రైతులకు ఇది అందుబాటులో ఉంటుంది. 

వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీనిని ఏర్పాటు చేశామని  జీఏవీఎల్ తెలిపింది. రైతు భూమి, పంటను బట్టి సలహాలు, సూచనలు ఇస్తామని పేర్కొంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, చీడపీడల బెడదల గురించి రైతులను అప్రమత్తం చేస్తుంది.