మిర్చి పంట కోసం గోద్రెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రోవెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త పురుగుల మందు

మిర్చి పంట కోసం గోద్రెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రోవెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త పురుగుల మందు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మిర్చి పంటలో చీడ పురుగులను నివారించడానికి గోద్రెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రోవెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళవారం ఓ కొత్త పురుగుల మందు రాషిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చింది. దీనిని  జపనీస్ కంపెనీ నిస్సాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   కార్పొరేషన్  తయారు చేస్తుండగా, గోద్రెజ్ ఆగ్రోవెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  దిగుమతి చేసుకొని ఇండియాలో అమ్ముతోంది.  మిర్చి పూత పూసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాషిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడాలని, కనీసం మూడు రకాలైన చీడ పురుగుల నుంచి పంటను కాపాడుతుందని కంపెనీ చెబుతోంది. రాషిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఎకరాకు ఒకసారి చల్లటానికి రూ. 2,900 ఖర్చవుతుందని వెల్లడించింది. 

కాగా, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పండుతున్న మిర్చి పంటలో ఇండియా వాటా సుమారు 36 శాతంగా ఉంది. దేశం నుంచి ఏటా రూ.10 వేల కోట్లకు పైనే మిర్చి ఎగుమతి అవుతోందని గోద్రెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రోవెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. దేశం నుంచి ఏటా రూ.40 వేల కోట్ల విలువైన క్రిమిసంహారకాలు  ఎగుమతి అవుతున్నాయని, ఇందులో తమ కంపెనీ వాటా రూ. 500 కోట్లు ఉంటుందని గోద్రెజ్ ఆగ్రోవెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండీ బలరాం సింగ్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ‘నిస్సాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమికల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఇండియాలో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందుబాటులోకి తెస్తున్నాం. మిర్చి పంట పూత దశలో ఉన్నప్పుడు రాషిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడాలని రికమండ్ చేస్తున్నాం.

 ఇప్పటికే హనబి, గ్రాసియా వంటి పురుగుల మందులను అమ్ముతున్నాం. మిరప పంటలోని వివివి దశలలో వాడడానికి క్రిమిసంహారకాలు అందుబాటులో ఉన్నాయి’ అని బలరాం సింగ్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు.