
న్యూఢిల్లీ: సవన్నా సర్ఫాక్టెంట్స్‌కు చెందిన ఫుడ్ అడిటివ్స్ బిజినెస్‌ను గోద్రెజ్ ఇండస్ట్రీస్ (కెమికల్స్) కొనుగోలు చేసింది. “ఒలియోకెమికల్స్, సర్ఫాక్టెంట్స్, స్పెషాలిటీస్, బయోటెక్ రంగాలలో అగ్రగామిగా ఉన్న తమకు తాజా డీల్‌తో ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలో కూడా విస్తరించడానికి వీలుంటుంది” అని గోద్రెజ్ గ్రూప్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
“స్పెషాలిటీ కెమికల్స్ సెగ్మెంట్‌లో మరిన్ని ప్రొడక్ట్‌లను అందుబాటులోకి తేవడానికి వీలుంటుంది. ఫ్యూచర్‌లో మరింత పెద్ద స్పెషాలిటీ బిజినెస్‌ను డెవలప్ చేస్తాం” అని గోద్రెజ్ ఇండస్ట్రీస్ (కెమికల్స్) సీఈఓ విశాల్ శర్మ
వివరించారు.