
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏడాదిలోపు 20 వేల ఔట్లెట్లకు పెంచుతామని డెయిరీ కంపెనీ గోద్రెజ్ జెర్సీ ప్రకటించింది. కొత్త ప్రొడక్టులను డెవలప్ చేయడానికి ఆర్ అండ్ డీపై ఖర్చును 50 శాతం పెంచుతామని, అన్ని ప్రాంతాల్లో బాదమ్ మిల్క్, పన్నీర్ వంటి ప్రొడక్టుల అమ్మకాలను భారీగా పెంచడానికి వ్యూహాలను రూపొందిస్తున్నామని సంస్థ సీఈఓ భూపేంద్ర సూరి వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాబోయే రెండేండ్లలో రూ.వెయ్యి కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జెర్సీ బాదమ్మిల్క్ను రూ.100 కోట్ల బ్రాండ్‌గా డెవెలప్ చేస్తాం. మా ప్రొడక్టుల ప్రచారం కోసం నటుడు దగ్గుబాటి రానాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాం”అని ఆయన వివరించారు.