ఆధ్యాత్మికం:  దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడో తెలుసా..

ఆధ్యాత్మికం:  దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడో తెలుసా..

హిందూ పురాణాల ప్రకారం .. ప్రతి నెల ఏదో ఒక విశిష్టత కలిగి ఉంది. శ్రావణం.. కార్తీక మాసాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అలాగే మార్గశిర మాసానికి కూడా అంతటి విశిష్టత ఉంది.  ఈ నెలను ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం .. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాలను కూడా ఈనెలలోనే పారాయణం చేస్తారు.  సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని ''పండుగ నెలపట్టడం'' అనికూడా అంటారు. 

ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.   జనవరి 14 వ కొనసాగుతుంది.  అప్పటివరకు ధనుర్మాసం రోజులలో ఉదయం .. సాయంత్రం.. ఇల్లు శుభ్రం చేసి దీపారాధ చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.  ధనుర్మాసంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విష్ణుమూర్తిని పూజిస్తూ.. ధనుర్మాసం వ్రతం చేస్తారు.  గోదాదేవి  ఈ నెలలో విష్ణు వ్రతం చేపట్టి స్వామివారికి విశేషంగా పూజలు చేసింది.  

ప్రస్తుతం ధనుర్మాసం కొనసాగుతుంది.  సాత్వికమైన ఆరాధనలకు ఎంతో ముఖ్యమైనది.  విష్ణు సంబంధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.   పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. మనకు  ఒకసంవత్సరం గడిస్తే.. అదే కాలాన్ని దేవతలు ఒక రోజుగా లెక్కిస్తారు.  సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించినప్పుడు  కర్కాటక సంక్రమణం అని... . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభమవుతుందని పండితులు చెబుతుంటారు. అంటే రాత్రి కాలం..  సూర్యుడు మకరరాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం....  అంటే పగలు అని అర్థం. ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిది. ఉత్తరాయణమునకు ముందున్న ధనుర్మాసం ప్రాతఃకాలమువలె పవిత్రమైనది. 

ధనుర్మాసంలో విష్ణుమూర్తిని  మధుసూధనుడు అనే పేరుతో ఆవాహన చేసి పూజిస్తారు.  15 చక్కెర పొంగళి  లేదా పులగం.. స్వామి వారికి సమర్పించగా.... మరో పదిహేను రోజులు దద్యోజనం నివేదిస్తారు.  ఇక పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు అందంగా ముగ్గులు పెడతారు.  సహజంగా సంక్రాంతి పండుగ నెల ముందు రోజలు ఇంటి ముందు  వాకిళ్లను  అందంగా రంగు రంగుల ముగ్గులతో అలంకరించి ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు.  ఇలా చేస్తే కోరుకున్న వరుడు లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.  
 
 గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. శ్రీకృష్ణుడికి ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి.. 

వ్రతం ఎలా చేయాంటే....

ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్లు విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తిచేయాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి.. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెలరోజులూ చేయలేని వాళ్లు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు