వాతావరణంలో వచ్చే మార్పులకు మనుషులైతే ఈ జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నారు కానీ దేవుళ్లకు చలి నుంచి రక్షణ ఎలా లభిస్తుంది అనే ఆలోచన తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ ( Bhopal )నగరవాసులకు వచ్చింది అంతే వారు తాము ఎంతో ఇష్టంతో కొలిచే దేవుళ్ళ విగ్రహాలకు స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలు కప్పారు.
శీతాకాలం.. చలిపులి చంపేస్తోంది. ప్రజలు చలి మంటలు వేసుకుని .. స్వెట్టర్లు కప్పుకుని చలినుంచి ఉపశమనం పొందుతున్నారు. చలి అనేది మనుషులకే ఉంటుందా..దేవుళ్లకు కూడా ఉంటుందా..? అదేంటీ దేవుళ్లకు చలి ఏంటీ..? అని ఆశ్చర్యపోవచ్చు.కానీ దేవుళ్లకు కూడా చలివేస్తోందట..అందుకే దేవుళ్లకు..దేవతలకు స్వెట్టర్లు కప్పారు. వినటానికి ఇదేదో వింతగా..విచిత్రంగా అనిపించొచ్చు. కానీ నిజమే. దేవుళ్లకు కూడా చలి వేస్తోందట..అందుకే స్వెట్టర్లు కప్పారు.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని సంకట మోచన హనుమాన్ టెంపుల్( Hanuman temple )లో దేవుళ్లకు స్వెటర్లు, శాలువాలు కప్పిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారాయి.శీతాకాలంలో చల్లటి గాలి నుంచి దేవుళ్లను రక్షించడానికే ఇలాంటి దుస్తులతో విగ్రహాలను అలంకరిస్తున్నామని భక్తులు తెలియజేశారు.ఈ విషయం తెలిసి మరింత మంది భక్తులు కానుకలుగా స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలను చేస్తున్నారు. వాటిని దేవాలయ పూజారులు దేవుళ్ల విగ్రహాలకు అలంకరించారు.
#WATCH | Madhya Pradesh: The idols of all the gods were dressed in warm clothes to protect them from the cold at the Sankat Mochan Hanuman Temple in Bhopal. (07.12) pic.twitter.com/9OAguvafOL
— ANI (@ANI) December 8, 2023
ప్రస్తుతాన్ని ఇండియాలో చలికాలం నడుస్తోంది.గత కొద్దిరోజులుగా భారతదేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలకు దారుణంగా పడిపోతున్నాయి. ఈ చలికి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు.ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలలో ఇంటికే పరిమితం అవుతున్నారు. చలి రాక్షసి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది స్వెటర్లు ధరిస్తున్నారు.మరికొందరు బయటికి రావాల్సి వస్తే దుప్పట్లు, శాలువాలు కప్పుకొని తిరుగుతున్నారు.
శీతాకాలంలో చలి వేస్తోందని స్వెట్లర్లు కప్పారు..మరి వేసవికాలంలో ఉక్కపోస్తోందని ఏసీలు, ఫ్యాన్లు పెడతారా.. ఏంటీ..? అని అనుకోవచ్చు.నిజమే ఇటువంటివి కూడా భారతదేశంలోని పలు దేవాలయాల్లో జరిగాయి. వేసవి వేడినుంచి ఉపశమనం కోసం కొన్ని దేవాలయాల్లో దేవుళ్లకు ఏసీలు, ఫ్యాన్లు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. బీహార్‌లోని గయాలో దేవుళ్లకు ఏసీలు పెట్టారు. అలాగే కోవిడ్ సమయంలో దేశంలోని పలు దేవాలయాల్లో దేవుళ్లకు మాస్కులు పెట్టిన ఘటనలు ఉన్నాయి.