కాంగ్రెస్​లోకి డాక్టర్​ కిరణ్?.. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డితో మీటింగ్

భైంసా, వెలుగు: నిర్మల్​జిల్లా ముథోల్​నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్​కిరణ్​ ఫౌండేషన్​చైర్మన్ డా.కిరణ్​త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. ముథోల్ నుంచి పోలిటికల్​ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటికే ఫౌండేషన్​సభ్యులు, మున్నూరు కాపులు, ఇతర ముఖ్య నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. కాగా ఆయన త్వరలోనే కాంగ్రెస్​గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్​లో బీసీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిర్మల్ నేత శ్రీహరి రావుతో కలిసి ఆదివారం ఆయన హైదరాబాద్​లో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్​లోకి రావాలని రేవంత్​రెడ్డి సూచించినట్లు తెలిపారు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటానని కిరణ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ముథోల్​నియోజకవర్గ ప్రజలు అవకాశమిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.