
మెదక్, వెలుగు : మెదక్ కలెక్టరేట్‌కు వెళ్లాలంటే కష్టాలు తప్పడం లేదు. అడుగుకో గుంత దర్శనమిస్తోంది. మెదక్ –-చేగుంట మెయిన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ బిల్డింగ్ కు దాదాపు అరకిలో మీటర్ దూరం ఉంటుంది. అంతా మట్టి రోడ్డే కాగా ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా మారింది.
కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ప్రజలు రోజూ వెళ్లే రోడ్డు ఈ దుస్థితిలో ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.