కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో గోల్ మాల్ జరిగింది. రైతులకు తెలియకుండా 2500 మంది రైతుల పేరు మీద పంట రుణాలను తీసుకుంది యాజమాన్యం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడ యూనియన్ బ్యాంకు లో రుణాలు తీసుకుంది గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం. పంట రుణాల మాఫీ మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయిన రైతులు..తీసుకోని లోన్ కు మాఫీ మేసేజ్ రావడంతో షాకవుతున్నారు.
ALSO READ : ఓరుగల్లుకు మొండిచేయి ఎంపీ ఎలక్షన్ బీజేపీ మేనిఫెస్టోలోని ఒక్క ప్రాజెక్ట్రాలే
400 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా 2,100 మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందని చెప్పారు. గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై రైతుల పేరిట కోట్ల రూపాయలు రుణాలు ఫ్యాక్టరీ తీసుకుంది యాజమాన్యం. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీయడంతో తిరిగి చెక్కుల రూపంలో డబ్బులు చెల్లిస్తామని యాజమాన్యం చెబుతోంది. విషయం బయటకు పోక్కకుండా జాగ్రత్తపడుతోంది. అసలు తమకు తెలియకుండా ఫ్యాక్టీరీ యాజమాన్యానికి బ్యాంక్ అధికారులు ఎలా రుణాలిస్తారని ప్రశ్నిస్తున్నారు.