- నెల రోజులపాటు కొనసాగిన ఉత్సవాలు
మెహిదీపట్నం, వెలుగు: నెల రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగిన గోల్కొండ జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ తల్లి) అమ్మవారి బోనాల జాతర ఆదివారంతో ముగిసింది. ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి తొమ్మిది పూజలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ రాజు, కమిటీ చైర్మన్ మహేశ్ తెలిపారు.
అమ్మవారి బోనాల జాతరలో రాష్ట్ర మంత్రులు, దేవాదాయ శాఖ, పోలీసు, జలమండలి, బల్దియా, గోల్కొండ కోట అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులందరూ తమ సహాయ సహకారాలను అందించారని, వీరందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.