మూడు రోజుల తర్వాత మహబూబాబాద్కు గోల్కొండ ఎక్స్ప్రెస్

మూడు రోజుల తర్వాత మహబూబాబాద్కు గోల్కొండ ఎక్స్ప్రెస్

మూడు రోజుల తర్వాత మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కి గోల్కొండ ఎక్స్ ప్రెస్ వచ్చింది.  భారీ వర్షాలకు  కే సముద్రం మండలం ఇంటెకన్నే, తాళ్ళుపూసపల్లి మధ్య   రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో  3 రోజుల పాటు యుద్ద ప్రాతిపదికన  పనులు పూర్తి చేశారు రైల్వే ఆధికారులు. రైల్వే స్టేషన్ కి గోల్కొండ ఎక్స్ ప్రెస్  రావడంతో   ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు.

 భారీ వరదలకు  మహబూబాబాద్ జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. దాదాపు 30 వేల ఎకరాల్లో పంటనష్టం జరగ్గా.. నలుగురు మృతి చెందారు.  ఇండ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వందలాది పశువులు చనిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.