
హైదరాబాద్, వెలుగు: పాన్ అమెరికన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్‌లో హైదరాబాద్ స్విమ్మర్ షేక్ సాజిదా రెండు మెడల్స్ గెలిచింది. అమెరికాలోని క్లేవ్‌లాండ్‌లో శుక్రవారం జరిగిన విమెన్స్ 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ ఫైనల్లో సాజిదా 3 నిమిషాల 31.54 సెకండ్లతో టాప్ ప్లేస్‌లో నిలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో 1 నిమిషం 44. 43 సెకండ్లతో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ మెడల్ నెగ్గింది. ఈ టోర్నీలో తెలంగాణ అథ్లెట్లకు ఇప్పటికే రెండు మెడల్స్ లభించాయి.