పెరిగిన బంగారం ధర..తగ్గిన వెండి.. హైదరాబాద్లో తాజా రేట్లు ఇవే

బంగారం, వెండి ధరలో మరోసారి పెరిగాయి.  దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 19వ తేదీన స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ధర రూ. 140 పెరిగి.... రూ. 55,050కు చేరుకుంది.  మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగి... రూ. 60,050కి చేరింది. 

పెరిగిన ధరలతో ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 55,200గా పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,210గా ఉంది.  కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,050గా అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర  60,050గా ఉంది.  అటు ముంబై, కేరళ, బెంగళూరు నగరాల్లోనూ ఇవే రేట్లు  ఉన్నాయి.

ALSO READ:  వెండి ధర  :  రూ.85 వేలకు!

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం  ధర రూ. 55,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,440గా పలుకుతోంది.  పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 55,050గా ఉండగా...24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా అమ్ముడవుతోంది. అహ్మదాబాద్​లో  22 క్యారెట్ల బంగారం ధర  రూ. 55,100, 24 క్యారెట్ల బంగారం  ధర రూ. 60,100గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,050గా... 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా ఉంది

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల  పసడి ధర రూ. 55,050గా ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050గా పలుకుతోంది.  విజయవాడలో 22 క్యారెట్ల  పసడి ధర రూ. 55,050గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050గా ఉంది. విశాఖపట్నంలో  22 క్యారెట్ల  బంగారం  ధర రూ. 55,050గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050గా అమ్ముడవుతోంది. 
.
దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కిలో  వెండి ధర రూ. రూ. 200 తగ్గింది.  దీంతో వెండి ప్రస్తుతం కిలోకు  రూ. 74,500గా పలుకుతోంది.  హైదరాబాద్​లో కిలో  వెండి ధర రూ. 78,200గా అమ్ముడవుతోంది.