Gold and silver Rates : లక్షకు నాలుగు వేలు తగ్గిన వెండి ధరలు

Gold and silver Rates :  లక్షకు నాలుగు వేలు తగ్గిన వెండి ధరలు

దేశవ్యాప్తంగా బంగారం ధరలు కాస్త పెరగగా..   వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.  జూన్ 11వ తేదీ మంగళవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150పెరిగి రూ.  65 వేల 850కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 170 పెరిగి రూ.  71 వేల 840కు చేరుకుంది. 

దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71 వేల 990గా ఉంది.  ఆర్థిక రాజధాని ముంబైలో   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65 వేలు850గా   ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71 వేల 184 గా ఉంది. 

హైదరాబాద్ విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65వేల580గా  ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71 వేల 184 గా ఉంది.  ఇక విజయవాడలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65వేల580గా  ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71 వేల 184 గా ఉంది.

 ఇక వెండి ధరలు రూ 4  వేల 500 తగ్గుముఖం పట్టాయి.  జూన్ 08వ తేదీన రూ. నాలుగు వేల 500 వందలు తగ్గగా  ఈ రోజుకు కూడా  అదే కొనసాగుతుంది.  ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి రూ.  95 వేలుగా ఉంది.