
Gold Price Today: భారతీయ పసిడి ప్రియులకు ప్రతిరోజూ పెరుగుతున్న పసిడి ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. ఈ మెగా ర్యాలీ చూస్తున్న చాలా మంది ఇక సామాన్యులకు బంగారం అందని ద్రాక్షలా మారుతుందా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పసిడిని పెట్టుబడిగా పరిగణించటంతో ప్రస్తుతం నిల్వ చేసేందుకు దీనిని అమితంగా కొనుగోలు చేస్తున్నారు.
రేపటి నుంచి అమెరికా తన పరస్పర పన్నులతో ఆటో రంగంపై సుంకాలను అమలులోకి తీసుకొస్తున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడిదారులు తమ డబ్బును బాండ్స్ మార్కెట్లు, గోల్డ్-వెండి వంటి విలువైన లోహాల్లోకి తరలిస్తున్నారు. ట్రంప్ చర్యల ప్రభావంత ప్రపంచ వ్యాపారాలపై ఎక్కువగా లేకపోతే త్వరలోనే ఈ ధరలు తిరిగి సాధారణ స్థాయిలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు 100 గ్రాములకు ఏకంగా రూ.8వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 510, ముంబైలో రూ.8వేల 510, దిల్లీలో రూ.8వేల 525, కలకత్తాలో రూ.8వేల 510, బెంగళూరులో రూ.8వేల 510, కేరళలో రూ.8వేల 510, వడోదరలో రూ.8వేల 515, జైపూరులో రూ.8వేల 525, మంగళూరులో రూ.8వేల 510, నాశిక్ లో రూ.8వేల 513, అయోధ్యలో రూ.8వేల 525, నోయిడాలో రూ.8వేల 525, గురుగ్రాములో రూ.8వేల 525, బళ్లారిలో రూ.8వేల 510 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
Also Read:-తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లు.. హైదరాబాదులో ఎంతంటే..?
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.9వేల 300 పెరుగుదలను నేడు చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ గోల్డ్ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 284, ముంబైలో రూ.9వేల 284, దిల్లీలో రూ.9వేల 299, కలకత్తాలో రూ.9వేల 284, బెంగళూరులో రూ.9వేల 284, కేరళలో రూ.9వేల 284, వడోదరలో రూ.9వేల 289, జైపూరులో రూ.9వేల 299, మంగళూరులో రూ.9వేల 284, నాశిక్ లో రూ.9వేల 287, అయోధ్యలో రూ.9వేల 299, నోయిడాలో రూ.9వేల 299, గురుగ్రాములో రూ.9వేల 299, బళ్లారిలో రూ.9వేల 284గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 510 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల 284గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలు పెరిగి నేడు రిటైల్ మార్కెట్లో రూ.1 లక్ష 14 వేలుగా విక్రయించబడుతోంది.