న్యూఢిల్లీ: బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలోని స్థానిక మార్కెట్‌లో మంగళవారం10 గ్రాముల పసిడి ధర రూ. 1,400 పెరిగి రూ.74,150కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్పెరగడమే ఇందుకు కారణం. శుక్రవారం సెషన్‌లో ఈ మెటల్ 10 గ్రాముల ధర రూ.72,750 వద్ద ముగిసింది. వెండి ధర కూడా క్రితం ముగింపుతో పోలిస్తే కిలోకు రూ.3,150 పెరిగి రూ.84 వేలకు చేరింది.
ఈసారి బడ్జెట్‌లో బంగారం దిగుమతి సుంకం తగ్గింపును ప్రకటించాక బంగారం ధరలు తగ్గాయి. గత నెలై 23న బంగారం ధర రూ. 3,350 తగ్గి 10 గ్రాములు రూ.72,300కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 18.80 డాలర్లు పెరిగి 2,560.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో మంగళవారం బంగారం ధర రూ.72,300లకు, వెండి ధర రూ.85,940లకు చేరింది.