బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడతాయని ఎదురుచూస్తున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్ అందుతోంది. శ్రావణమాసం ఆరంభంలో తగ్గినట్లు తగ్గి మగువలను సంబరపరిచిన పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు సిద్ధమవడం, ఆర్థిక మాంద్యం భయాలు, వడ్డీ రేట్ల కోత నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. దాంతో, పసిడి ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి.
ఆదివారం 24 క్యారెట్ల బంగారం ధర రికార్డు స్థాయిలో 10 గ్రాములకు 1,140 పెరిగి 72,770కి చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1050 పెరిగి, రూ. 66,770 వద్ద కొనసాగుతోంది. బంగారానికి పోటీగా వెండి రేటు దూసుకెళ్తోంది. కిలో వెండి ధర ఆదివారం రూ.2000 పెరిగి రూ. 90 వేల మార్కు దాటింది. హైదరాబాద్ మార్కెట్లో తులం వెండి ధర రూ.910 పలుకుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు
ఢిల్లీ: రూ. 72,920(24 క్యారెట్లు), రూ. 66,850 (22 క్యారెట్లు)
ముంబై: రూ. 72,770 (22 క్యారెట్లు), రూ. 66,770 (22 క్యారెట్లు)
చెన్నై: రూ. 72,770 (22 క్యారెట్లు), రూ. 66,770 (22 క్యారెట్లు)
హైదరాబాద్: రూ. 72,770 (22 క్యారెట్లు), రూ. 66,770 (22 క్యారెట్లు)
విజయవాడ: రూ. 72,770, రూ. 66,770 (22 క్యారెట్లు)
బెంగళూరు: రూ. 72,770, రూ. 66,770 (22 క్యారెట్లు)