
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కొత్త ఏడాదిగా జరుపుకునే పండుగ ఉగాధి. మార్చి 30, 2025న తెలుగు సంవత్సరాది ఉగాధి పండుగ వస్తున్నందున చాలా మంది తమకు ఇష్టమైన బంగారం, వెండి ఆభరణాల కొనుగోలుతో కొత్త ఏడాదిని స్టార్ట్ చేయాలని చూస్తుంటారు. అలాంటి వారికి నిరంతరం పెరుగుతున్న పసిడి ధరలు పెద్ద షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆభరణాల షాపింగ్ చేయాలని భావిస్తున్న ప్రజలు ముందుగా నేడు పెరిగిన రిటైల్ గోల్డ్, సిల్వర్ విక్రయ ధరలను గమనించటం చాలా కీలకం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.10 వేల500 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల340, ముంబైలో రూ.8వేల340, దిల్లీలో రూ.8వేల355, కలకత్తాలో రూ.8వేల340, వడోదరలో రూ.8వేల345, బెంగళూరులో రూ.8వేల340, కేరళలో రూ.8వేల340, జైపూరులో రూ.8వేల355, మంగళూరులో రూ.8వేల340, నాశిక్ లో రూ.8వేల343, అయోధ్యలో రూ.8వేల251, గురుగ్రాములో రూ.8వేల251, నోయిడాలో రూ.8వేల251 వద్ద కొనసాగుతున్నాయి. ఈ రేట్లకు జీఎస్టీ, తరుగు, మజూరి, షాపు యజమానుల లాభం వంటివి అదనంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.
Also Read : గోల్డ్‌మన్ శాక్స్ మెగా స్టాక్ షాపింగ్
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.11 వేల 400 పెరుగుదలను నమోదు చేసింది. దీని కారణంగా దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ రేట్లను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల098, ముంబైలో రూ.9వేల098, దిల్లీలో రూ.9వేల113, కలకత్తాలో రూ.9వేల098, వడోదరలో రూ.9వేల103, బెంగళూరులో రూ.9వేల098, కేరళలో రూ.9వేల098, జైపూరులో రూ.9వేల113, మంగళూరులో రూ.9వేల098, నాశిక్ లో రూ.9వేల101, అయోధ్యలో రూ.9వేలు, గురుగ్రాములో రూ.9వేలు, నోయిడాలో రూ.9వేలుగా ఉన్నాయి.
Also Read:-దేశంలో కొత్త విమాన సంస్థలు.. ఇండిగో-టాటాలతో పోటీపడతాయా?
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల340 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు తగ్గిన తర్వాత రూ.9వేల098గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.3వేల భారీ పెరుగుదలతో ప్రస్తుతం రూ.లక్ష14వేల వద్ద నేడు విక్రయించబడుతోంది.