
Gold Price Today: చాలా కాలం తర్వాత నిన్న కొంత పసిడి ధరలు తగ్గటంతో పెట్టుబడిదారులకు ఊరట లభించిన సంగతి తెలిసిందే. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫార్మా, ఆటో రంగాల దిగుమతులపై సుంకాలు వచ్చే నెల నుంచి అమలులోకి వస్తాయనే భయాల మధ్య ఇన్వెస్టర్లు తమ డబ్బును సేఫ్ హెవెన్ పసిడిలోకి తరలించటంతో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇది రేట్ల పెరుగుదులకు దారితీయటంతో భారతీయ పసిడి ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే నేడు షాపింగ్ చేసేవారు తాజాగా పెరిగిన రిటైల్ రేట్లను ముందుగా తెలుసుకోవాలి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.వెయ్యి పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8195, ముంబైలో రూ.8195, దిల్లీలో రూ.8210, కలకత్తాలో రూ.8195, బెంగళూరులో రూ.8195, కేరళలో రూ.8195, వడోదరలో రూ.8200, జైపూరులో రూ.8210, నాశిక్ లో రూ.8187, నోయిడాలో రూ.8210, బళ్లారిలో రూ.8195 వద్ద కొనసాగుతున్నాయి. అయితే పైన పేర్కొన్న రేట్లకు జీఎస్టీ, మజూరి, తరుగు, వ్యాపారి లాభం వంటి ఇతర ఖర్చులు అదనంగా కొనుగోలుదారులు భరించాల్సి ఉంటుంది.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.1100 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలో ప్రస్తుతం వివిధ నగరాల్లో పెరిగిన గ్రాము బంగారం ధరను గమనిస్తే.. చెన్నైలో రూ.8940, ముంబైలో రూ.8940, దిల్లీలో రూ.8955, కలకత్తాలో రూ.8940, బెంగళూరులో రూ.8940, కేరళలో రూ.8940, వడోదరలో రూ.8945, జైపూరులో రూ.8955, నాశిక్ లో రూ.8931, నోయిడాలో రూ.8955, బళ్లారిలో రూ.8940గా ఉన్నాయి.
Also Read:-నేటి నుంచే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ నిలిపివేత.. ఎవరికి నష్టమంటే..?
ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తిరుపతి, కడప, కాకినాడ, నెల్లూరులో గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ.8195గా ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం రేటు రూ.8940గా కొనసాగుతోంది. ఇదే సమయంలో ఏపీ తెలంగాణలో కేజీ వెండి ధర నేడు రూ.1000 పెరుగుదలతో రూ. లక్ష 11 వేలుగా కొనసాగుతోంది.