Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ర్యాలీకి నేడు బ్రేక్ తీసుకున్న గోల్డ్, హైదరాబాదు రేట్లివే..

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ర్యాలీకి నేడు బ్రేక్ తీసుకున్న గోల్డ్, హైదరాబాదు రేట్లివే..

Gold Price Today: 24 క్యారెట్ల తులం బంగారం ధరలు ప్రస్తుతం లక్ష రూపాయల మార్కుకు అతిచేరువకు చేరుకున్న సమయంలో దేశంలోని పసిడి ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో స్పాట్ మార్కెట్లో కూడా బంగారం ధరలు గతంలో ఎన్నడూ చూడని గరిష్ఠాలకు చేరుకున్నాయి. అయితే దాదాపు మూడు రోజులు భారీగా కొనసాగిన పసిడి ధరల ర్యాలీ వారాంతంలో బ్రేక్ తీసుకోవటంతో చాలా మంది అక్షయతృతీయకు ముందు షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేటి రేట్లను ఇందుకోసం ముందుగా తెలుసుకోవటం ముఖ్యం. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 945, ముంబైలో రూ.8వేల 945, దిల్లీలో రూ.8వేల 960, కలకత్తాలో రూ.8వేల 945, బెంగళూరులో రూ.8వేల 945, కేరళలో రూ.8వేల 945, పూణేలో రూ.8వేల 945, వడోదరలో రూ.8వేల 950, జైపూరులో రూ.8వేల 960, లక్నోలో రూ.8వేల 960, కోయంబత్తూరులో రూ.8వేల 945, నోయిడాలో రూ.8వేల 960, బళ్లారిలో రూ.8వేల 945, గురుగ్రాములో రూ.8వేల 960, అయోధ్యలో రూ.8వేల 960 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి స్థాయిలోనే ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 758, ముంబైలో రూ.9వేల 758, దిల్లీలో రూ.9వేల 773, కలకత్తాలో రూ.9వేల 758, బెంగళూరులో రూ.9వేల 758, కేరళలో రూ.9వేల 758, పూణేలో రూ.9వేల 758, వడోదరలో రూ.9వేల 763, జైపూరులో రూ.9వేల 773, లక్నోలో రూ.9వేల 773, కోయంబత్తూరులో రూ.9వేల 758, నోయిడాలో రూ.9వేల 773, బళ్లారిలో రూ.9వేల 758, గురుగ్రాములో రూ.9వేల 773, అయోధ్యలో రూ.9వేల 773గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర తులం(10 గ్రాములకు) రూ.89వేల 450 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు  తులం(10 గ్రాములకు)  రూ.97వేల580గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 10వేల వద్ద  కొనసాగుతోంది. పైన  పేర్కొన్న ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటి ఖర్చులను కలపక ముందువిగా గమనించాలి.