దీపావళి పండుగకు ముందు వరకు తగ్గుతూ వచ్చిన బంగారంధరలు.. పండుగ తరువాత పరుగులు పెడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు దాదాపుగా రూ. 1000 వరకు పెరిగాయి. 2023 నవంబర్ 15న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55 వేల 950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61 వేల 040గా ఉంది. ప్రస్తుతం అంటే నవంబర్22వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56 వేల 850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62 వేల 020గా ఉంది. దీంతో కొనేవారికి మళ్లీ పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57 వేలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62 వేల 170గా ఉంది. ఇక అర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56 వేల850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62 వేల 150గా ఉంది.
హైదరాబాద్ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56 వేల 850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62 వేల 020గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56 వేల 850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62 వేల 020గా ఉంది.
అయితే వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. నవంబర్ 22 రోజున మార్కెట్ లో రూ. 400 తగ్గిన కేజీ వెండి ప్రస్తుతం రూ. 79 వేలుగా ఉంది.
ALSO READ : నిర్మలమ్మే ఒప్పుకుంది.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తరు : హరీష్ రావు