బంగారం ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. జనవరిలో కాస్త తగ్గుతూ పెరుగుతూ వొలటైల్ గా కనిపించిన ధరలు.. నెలాఖరులో మళ్లీ భారీగా పెరిగిపోయాయి. శనివారం (ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో.. మున్ముందు గోల్డ్ రేట్స్ ఎలా ఉంటాయోనన్న సస్పెన్స్ కొనసాగుతుండగానే.. ఇవాళ (శుక్రవారం) బంగారం ధరలు మళ్లీ పెరిగి లైఫ్ టైమ్ హై కి చేరుకున్నాయి.
ఇండియా బులియన్స్ డేటా ప్రకారం శుక్రవారం (జనవరి 31) ఢిల్లీలో గోల్డ్ రూ.81,120 కు చేరుకుంది. పది రోజుల క్రితం ధరలతో పోల్చితే ఇవాళ 2.2 శాతం పెరిగింది. అదే వెండి 0.78 శాతం పెరిగింది.
శుక్రవారం (జనవరి 31) హైదరాబాద్ లో గోల్డ్, సిల్వర్ ధరలు:
శుక్రవారం హైదరాబాద్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.83, 020 ఉండగా ఒకే రోజులో రూ.1310 పెరిగి 84,330కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా. ధర 76 ,100 నుంచి 77,300కు చేరుకుంది. అంటే రాత్రికి రాత్రే 1200 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరుకుంది.
24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 84,330 ఉండగా
22 కారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 77,300 గా ఉంది.
సిల్వర్ రేట్స్:
హైదరాబాద్ లో శుక్రవారం (జనవరి 31) సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. గురువారం 1 కేజీ వెండి ధర రూ.1,06, 000 ఉండగా.. ఇవాళ (శుక్రవారం) ఒక వేయి రూపాయలు పెరిగి 1,07,000 కు చేరుకుంది.
ఢిల్లీలో బంగారం, వెండి ధరలు:
ఢిల్లీ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.660 పెరిగి రూ.81,230 కి చేరుకుంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74,461 గా నమోదైంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.92,900 గా ఉంది.
ముంబయిలో గోల్డ్ రేట్స్:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,230. గత వారం జనవరి 24న రూ.80,240 గా ఉంది.
కిలో వెండి ధర రూ. 92,000, గత వారం రూ.91,720 గా ఉంది.