
ఏటీఎం అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏమిటి.. డబ్బులు విత్ డ్రా చేయడం.. డిపాజిట్ చేయడం. కానీ ఇక నుంచి బంగారాన్ని కూడా ఏటీఎంలో డిపాజిట్ చేయవచ్చు. ఇలా బంగారం వేసి అలా డబ్బులు తీసుకోవచ్చు. చిత్రంగా ఉన్నా ఇది నిజం.. చైనాలో ఈ గోల్డ్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో కూడా ఆమధ్య గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. దీని ద్వారా కావాల్సిన గోల్డ్ లోన్ తూకం ఆధారంగా ఏటీఎంలోనే తీసుకునే సదుపాయం ఉటుంది. కానీ చైనా ఏటీఎం దీనికి పూర్తి భిన్న. అదేంటో తెలుసుకుందాం.
చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలోని ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఈ గోల్డ్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. కింగ్ హుడ్ గ్రూప్ తయారు చేసిన ఈ ఏటీఎం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచింది. ఎవరైనా తమ వద్ద ఉన్న బంగారు నగలు, కడ్డీలు, గోల్డ్ బిస్కెట్లు ఈ ఏటీఎంలో జమ చేయవచ్చు. వేసిన 30 నిమిషాలలో దానికి తగిన విలువైన క్యాష్ ను ఇస్తుంది.
►ALSO READ | కొలిక్కి వచ్చిన గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ కేసు.. గుత్తాధిపత్యం కోసం చేసిన పనికి రూ.20 కోట్ల భారీ మూల్యం
బంగారం వేసిన వెంటనే 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగించి దాని ప్యూరిటీని లెక్కిస్తుంది ఈ ఏటీఎం. ఆ త ర్వాత బరువు కొలచి దానికి విలువైన డబ్బులు ఎన్ని వస్తాయో డిస్ప్లే చేస్తుంది. ఆ రోజుకు ఉన్న మార్కెట్ ధరల ప్రకారం దాని విలువను లెక్కిస్తుంది. ఆ తర్వాత మన బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. ఇదంతా 30 నిమిషాలలోనే జరిగిపోతుంది. కాగా ఈ ఏటీఎం గురించి టెక్ ఇన్ ఫ్లూయెన్సర్ టన్సు యెగెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ గోల్డ్ ఏటీఎం కు సంబంధించిన వీడియో.
A gold ATM in Shanghai, China
— Tansu Yegen (@TansuYegen) April 19, 2025
It melts the gold and transfers the amount corresponding to its weight to your bank account.
pic.twitter.com/hFu3AjqEo2
ఈ ఏటీఎం 3 గ్రాముల పైనున్న బంగారాన్ని తీసుకుంటుంది. కనీసం 50 శాతం స్వచ్ఛత కలిగి ఉండాలి. షాంఘై ఎక్స్ చేంజ్ రేటు ఆధారంగా క్యాష్ గా కన్వర్ట్ చేస్తుంది. సర్వీస్ ఛార్జెస్ కట్ చేసుకుని 30 నిమిషాల్లో మన అకౌంట్ కు డబ్బులు ట్రాన్సఫర్ చేస్తుంది.
తుర్కిష్ టెక్ ఇన్ఫ్లుయెన్సర్ టన్సు యెగెన్ షేర్ చేసిన తర్వాత 14 లక్షల వ్యూస్ తో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు.