
కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. మార్చి 4న దుబాయ్ నుంచి రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించినందుకు రన్యా రావును బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు అధికారులు. రన్యారావు కన్నడ నటి మాత్రమే కాదు..కర్ణాటక రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌లో ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె. ఇదంతా అలావుంచితే..14 కేజీల బంగారాన్ని దుబాయ్ లో హైసెక్యూరిటీ సిస్టమ్ను తప్పించుకొని ఎలా తీసుకొచ్చింది..బెంగళూరులో ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నించిందో తెలిస్తే నివ్వెర పోవాల్సిందే..
మార్చి 4న దుబాయ్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దిగిన రన్యారావు.. ఎయిర్ పోర్టులో పనిచేసే బసవరాజు అనే కానిస్టేబుల్ సాయంతో బయటపడేందుకు ప్రయత్నించింది. చెకింగ్ సమయంలో బసవరాజు ఆమె సాయం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే రన్యా రావు యాక్టివిటీస్ పై ముందస్తు సమాచారం ఉన్న రెవెన్యూ డిపార్టుమెంట్ ఆఫ్ ఇండియా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కర్ణాటక రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌లో ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె.
ఇక రన్యారావు 14.2 కేజీల బంగారాన్ని ఎలా ట్రాన్స్ పోర్ట్ చేసిందో తెలిస్తే నివ్వెర పోవాల్సిందే.. ఆమె వేసుకున్న జాకెట్ లోపలి భాగంలో కొంత, బెల్ట్ రూపంలో కడ్డీలుగా మరికొంత దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంత బంగారం ఉన్నా సెక్యూరిటీ సిస్టమ్ గుర్తించలేదు. కారణం రన్యారావు డీజీపీ సంబంధీకులు కావడం, కానిస్టేబుల్ బసవరాజు సాయంతో సెక్యూరిటీ సిస్టమ్ ను తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయితే ముందస్తు సమాచారం ఉండటంలో DRI పోలీసులకు రన్యారావు దొరక్కతప్పలేదు. రన్యారావు నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువు దాదాపు 12కోట్ల 56 లక్షలు.
రన్యారావును మొదట నాగవరంలోని DRI ఆఫీసుకు తరలించారు అధికారులు. ఫార్మాల్టీస్ పూర్తయ్యాక 1962 కస్టమ్స్ చట్టం కింద రన్యారావును 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుం నటి రన్యారావు విచారణ కోసం పరప్పన అగ్రహారలోని క్వారంటైన్ సెల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలకాలంలో రన్యారావు దుబాయ్, ఇతర దేశాల పర్యటనపై దర్యాప్తు జరుగుతోంది.ఎటువంటి సెక్యూరిటీ చెకప్ లేకుండా ఎయిర్ పోర్టులో చాలాసార్లు తప్పించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆమె భర్తను కూడా ఏజెన్సీలు ప్రశ్నించే అవకాశం ఉంది.