తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బంగారం, వెండి భారీగా పట్టుబడుతుంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. సరైన పత్రాలు లేని బంగారం, వెండిని రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేస్తున్నారు.
తాజాగా నల్గొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారిపై రెండు కార్లలో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. ఓ కారులు 30కిలోల బంగారం, 188 కిలోల వెండి పట్టుబడింది. వాటి విలువ రూ. 13కోట్ల 8లక్షలు ఉంటుందని పోలీసులు అంచానా వేశారు.
మరొక కారులో 40కిలోల బంగారం, 190 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఈ భారీ బంగారం, వెండి జ్యువెల్లరీ దుకాణాలకు సంబంధించిన ఆభరణాలుగా పోలీసులు గుర్తించారు. వీటికి సబంధించి పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు.