
- రెండు తులాల బంగారు చైన్ బాధితురాలికి అప్పగింత
రేవల్లి, వెలుగు: రేవల్లి మండల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ జి. శివకుమార్, భ్రమరాంబ మల్లికార్జున ఉత్సవాల్లో బందోబస్తు డ్యూటీ చేశాడు. ఈ క్రమంలో ఓ మహిళ పోగొట్టుకున్న రెండు తులాల బంగారం చైన్ ను గుర్తించి ఎస్ఐకి అప్పగించారు. బాధితురాలు గుపని మమత, స్వామివారి కల్యాణోత్సవానికి వచ్చినప్పుడు బంగారం చైన్ పోగొట్టుకుంది. శివకుమార్ గుర్తించి బాధితురాలకు తిరిగి ఇచ్చారు. ఎస్ఐ రాము, ఏఎస్ఐ మల్లయ్య శివకుమార్ నిజాయతీకి అభినందనలు తెలిపారు. బాధితులు శివకుమార్‌ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.