లిఫ్ట్ పేరుతో వృద్ధురాలి నుంచి బంగారు గొలుసు దోచుకున్న దొంగలు

లిఫ్ట్ పేరుతో ఓ వృద్ధురాలి నుంచి 2 తులాల బంగారు గోలుసు దోచుకున్నారు.. కేటుగాళ్లు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని చిట్యాలలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన దేశగోని బలనర్సమ్మ అనే వృద్ధురాలు చిట్యాలలో ఉన్న తన కుమారుడు ఇంటికి బయలుదేరింది. ఆమె చిట్యాల పట్టణ కేంద్రంలోని బస్టాండ్‌కు చేరుకొని కొడుకు కోసం వేచి చూస్తోంది. 

అదే సమయంలో అక్కడికి చేరుకున్న కేటుగాళ్లు ఆమెను కొడుకు ఇంటివద్ద దింపుతామని నమ్మకలికి బైక్ పై ఎక్కించుకున్నారు. అనంతరం మార్గ మధ్యలోకి వెళ్ళగానే ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు గోలుసు దోచుకొని అక్కడే వదిలేశారు. స్థానికుల సాయంతో వృద్ధురాలు చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Also Read : భారత సంస్కృతికి మోదీ ఒక అంబాసిడర్