మహిళ పుస్తెల తాడు తెంపుకెళ్లిండు

షాద్​నగర్, వెలుగు: మహిళ పుస్తెల తాడును స్నాచర్  లాక్కెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని అల్వాల్ శివారులో జరిగింది. తులవానిగడ్డ గ్రామానికి చెందిన జువ్వు శ్రీలత సోమవారం తన పొలంలో పశువులు మేపుతోంది. మధ్యాహ్నం 3.45 నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్​పై వచ్చి ఆమె మెడలోని 4 తులాల పుస్తెలతాడును లాక్కొని పారిపోయాడు. శ్రీలత వెంటనే తేరుకొని చూసేలోపు పారి పోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించి  కేసు నమోదు చేశారు. శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి బాధితురాలి వద్దకు వెళ్లి చోరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని సూచించారు.