
న్యూఢిల్లీ: పుత్తడి పరుగు ఆగడం లేదు. ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు రూ.500 పెరిగి మరో రికార్డు గరిష్ట స్థాయి రూ.91,250కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. విదేశాల్లో బలమైన ట్రెండ్ కారణంగా స్టాకిస్టులు, రిటైలర్లు నిరంతరం కొనుగోళ్లు జరపడమే ఇందుకు కారణమని పేర్కొంది.
సోమవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 బంగారం ధర రూ.1,300 పెరిగి రూ.90,750కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర రూ.450 పెరిగి 10 గ్రాములకు రూ.90,800కి చేరుకుంది. వెండి ధర మారలేదు. కిలో ధర రూ.1.02 లక్షలు పలుకుతోంది. అమెరికాలో మాంద్యం భయాలు, ట్రంప్ ప్రభుత్వ విధానాలతో బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది.